telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బడ్జెట్ లో లుకలుకలు… ఏడాదికి 9 లక్షలైనా పన్ను సున్నా..

no tax even if 9 laks income per year

నిన్న లోక్ సభలో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దానిని ఎవరూ హర్షించనప్పటికీ, అదొక ఓట్ల కోసం బీజేపీ రూపొందించిన బడ్జెట్ గా అన్ని పార్టీలు ఎద్దేవా చేశాయి. అయితే ఇక సామాన్యుల వైపు నుండి చుస్తే మాత్రం అది వరాల జల్లుగానే ఉంది. అదేకదా బీజేపీ వ్యూహం, అప్పుడే రాబోయే ఎన్నికలలో ఓట్లు రాలతాయి. ఇక విషయానికి వస్తే, 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను, మధ్యంతర బడ్జెట్ ప్రతిపాదనలు నిన్న పార్లమెంట్ ముందుకు వచ్చాయి. ప్రస్తుతం ఆదాయపు పన్ను పరిమితి రూ. 2.50 లక్షలు కాగా, ఇకపై రూ. 5 లక్షల వరకూ పన్ను చెల్లింపులపై రిబేట్ ఇవ్వనున్నామని పీయుష్ గోయల్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఎగువ మధ్య తరగతికీ ఉపశమనం కలుగుతుండగా, మినహాయింపులను సరిగ్గా వినియోగించుకుంటే, ఆదాయం రూ. 9 లక్షలు దాటినా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. చేయాల్సిందల్లా, సెక్షన్ 80-సీ కింద పన్ను రాయితీలు లభించే పెట్టుబడి మార్గాలను చూసుకోవడమే.

అదెలాగంటే…ఒక వ్యక్తి సంవత్సర ఆదాయం రూ. 9.50 లక్షలు అనుకుందాం. ఇక ఇందులో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేలు, సెక్షన్ 80-సీ మినహాయింపులు రూ. 1.50 లక్షలు, ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ రూ. 2 లక్షలు (పన్ను పరిధిలోకి రానిది), ఎన్పీఎస్ పెట్టుబడి రూ. 50 వేలు, ఆరోగ్య బీమా ప్రీమియం రూ. 25 వేలుగా భావించి, వాటిని తీసివేస్తే, నికరంగా పన్ను చెల్లించాల్సిన ఆదాయం రూ. 4.50 లక్షలు ఉంటుంది. దీనిపై రూ. 10 వేలు చెల్లించాల్సివుంటుంది. సెక్షన్ 87-ఏ కింద గరిష్ఠ రిబేటు రూ. 12,500 ఉంది కాబట్టి, కేంద్రానికి చెల్లించాల్సిన పన్ను ఏమీ ఉండదు.

దీనిని బట్టి కేంద్ర బడ్జెట్ సామాన్యులకు లాభదాయకంగానే ఉన్నట్టే. ఇక దీనివెనుక గుట్టు విషయానికి వస్తే, ఆదాయాన్ని సృష్టించాలంటే, పొదుపు సొమ్మును సర్క్యూలేట్ చేస్తే సరిపోతుంది అనేది కేంద్రం ఆలోచన. అంటే పన్ను పరిధిలోకి రాని పొదుపు పథకాలలో సామాన్య ఉద్యోగస్తులు వారి సంపాదనను దాచుకుంటారు. అది ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. దీనితో ప్రభుత్వానికి పొదుపు సొమ్ము ఎక్కువగా అందుబాటులోకి వస్తుంది. దానినే కేంద్రం సర్క్యూలేట్ చేసి, ఆదాయ మార్గాలను సుగమం చేసుకుంటుంది. సెక్షన్ 80సి లాంటివాటి వెనుక ఉన్న గుట్టు ఇదే. దాని పరిధి పెంచింది, ప్రభుత్వానికి మూలధనం పెరగటం కోసం. సామాన్యుల పొదుపే వారి మూలధనం. అది విషయం. ఇక్కడ మరొకటి కూడా ఉంది.. రాబోయే ఎన్నికలలో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాకుంటే, ఈ బడ్జెట్ అమలు కాదు; అందుకే లోక్ సభలో దీనిని తాత్కాలిక బడ్జెట్ గా ప్రవేశపెట్టారు.

Related posts