telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

రైతుల నామినేషన్ల తిరస్కరణ.. మోడీపై పోటీకి మిగిలింది ఒక్కడే..

only one farmer on modi in varanasi

లోక్ సభ ఎన్నికల్లో అత్యధికంగా రైతులు పోటీ చేసి దేశం దృష్టిని ఆకర్షించారు. ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడిని టార్గెట్ చేసి నిజామాబాద్ రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. కానీ వారణాసిలో నామినేషన్లు వేసిన రైతులకు ఈసీ షాక్ ఇచ్చింది. 24 మంది రైతుల నామినేషన్లను తిరస్కరించింది. నామినేషన్ల స్క్రూటినీలో 24 మంది ఆర్మూర్ రైతుల నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. ఎర్గాట్ల మండలానికి చెందిన రైతు ఇస్తారి నామినేషన్‌ ను మాత్రమే ఆమోదించారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే నామినేషన్లు తిరస్కరించారని ఆరోపించారు. రైతులు నామినేషన్లు వెయ్యటానికి అడుగడుగునా ఇబ్బందులు సృష్టించిన అధికారులు నామినేషన్లను కావాలనే తిరస్కరించారని వారు ఆరోపిస్తున్నారు.

మే 3న ఢిల్లీకి వెళ్లి, దీనిపై తెలంగాణ పసుపు రైతుల సంఘం నేతలు…వారణాసి అధికారులపై సీఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. వారణాసిలో మోడీతో పాటు 119 మంది నామినేషన్లు వేయగా వివిధ కారణాలతో 89 మంది నామినేషన్లను తిరస్కరించారు. ప్రస్తుతం వారణాసి లోక్ సభ స్థానం బరిలో ప్రధాని మోడీ సహా 30మంది మాత్రమే ఉన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా నిజామాబాద్ పసుపు రైతులు ఎన్నికల బరిలోకి దిగారు. తెలంగాణా రాష్ట్రంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుండి 178 మంది రైతులు ఎన్నికల్లో పోటీ చేసి తమ డిమాండ్ ను దేశ వ్యాప్తంగా తెలిసేలా చేశారు.

Related posts