telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వాఘా సరిహద్దు వద్ద .. మిఠాయిల పంపిణి నిలిపివేత..

no sweets sharing at wagah boarder

భారత్-పాకిస్తాన్ మధ్య పంజాబ్‌లోని వాఘా సరిహద్దు వద్ద సంప్రదాయ వేడుకలు, జాతీయ దినోత్సవాల సందర్భంగా ప్రతి ఏడాది మిఠాయిల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. భారత బీఎస్ఎఫ్(బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) పాకిస్తానీ రేంజర్లు ఒకరికొకరు మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకొంటారు. అయితే ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం రోజున ఇరు దేశాల మధ్య మిఠాయిల పంపిణీ జరగలేదు. ఇదిలా ఉంటే గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున కూడా ఇరు దేశాల మధ్య మిఠాయిల పంపిణీ జరగలేదు.

రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో ఎన్నో ఏళ్లుగా వస్తున్న మిఠాయిల పంపిణీ సంప్రదాయాన్ని సైతం ఇరు దేశాలు నిలిపివేసినట్లు తెలుస్తోంది.

Related posts