telugu navyamedia
రాజకీయ వార్తలు

రూ.20 లక్షల కోట్లతో భారీ ప్యాకేజిపై మరిన్ని వివరాలు!

Nirmalasitaraman

ప్రధాని నరేంద్ర మోదీ రూ.20 లక్షల కోట్లతో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకంలో కేటాయింపుల వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతి రోజూ మీడియా సమావేశం నిర్వహించి దశలవారీగా వెల్లడిస్తున్నారు. ఇవాళ నాలుగో విడత ప్యాకేజి వివరాలు తెలిపారు. ప్రధానంగా బొగ్గు, ఖనిజాలు, అణు విద్యుత్, రక్షణ రంగం, ఏరో స్పేస్, విమానయానం, విమాన మరమ్మతుల రంగాలకు సంబంధించిన కేటాయింపుల గురించి నిర్మల వెల్లడించారు.

ప్యాకేజీలోని ముఖ్యాంశాలు:

– అంతరిక్ష పరిశోధనారంగంలో ఇస్రోతో పాటు ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించడం
– లెవల్‌ ఫ్లేయింగ్‌ ఫీల్డ్‌ కల్పించే విధంగా సంస్కరణలు
– జియో స్పేషియల్‌ రంగంలో ప్రైవేటు సంస్థలకు అవకాశాలు. భారతీయ స్టార్టప్‌లకు ప్రోత్సాహం
– టూరిజం, విమానయాన రంగానికి ప్రోత్సాహకాలు
– అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశీయ సంస్కరణలు
– ఉపాధి అవకాశాల పెంపుపై దృష్టి
– కీలక రంగాల్లో పాలసీల సరళతరంపై దృష్టి
– పారిశ్రామిక అవసరాల కోసం 5 లక్షల ఎకరాల భూమి సిద్ధం
– బొగ్గు, ఖనిజాలు, రక్షణ ఉత్పత్తులపై ప్యాకేజి
– ఏరో స్పేస్, విమానయాన రంగం, విమాన మరమ్మతులపై ప్యాకేజి
– చిన్న నగరాలకు విమాన సౌకర్యాలు
– రాష్ట్రాల్లో ఇండస్ట్రియల్ క్లస్టర్లలో మౌలిక సదుపాయాల కనెక్టివిటీ అప్ గ్రేడ్
– పరిశ్రమలకు అవసరమైన భూముల వివరాల కోసం ఐఐఎస్ విధానం
– కోల్ ధరలు నిర్ణయించనున్న కేంద్రం
– బొగ్గు గనుల బిడ్డింగ్ విధానం మరింత సరళతరం
– ఎలాంటి కండిషన్లు లేని బిడ్డింగ్ విధానం
– బిడ్డింగ్ కు అందుబాటులో 50 గనులు
– మైనింగ్ రంగంలో మౌలిక సదుపాయాల కోసం రూ.50 వేల కోట్లు
– బొగ్గు గనుల యాంత్రీకరణ కోసం రూ.18 వేల కోట్లు
– దేశీయంగానే ఆయుధ అనుబంధ ఉత్పత్తుల తయారీ

Related posts