telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎవరికి భయపడొద్దు..అందరికి ఇల్లు వస్తుంది

రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు పట్టాలను మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కేటీఆర్..మాట్లాడుతూ.. సిఎం కేసీఆర్ చెప్పి నట్టు ఎద్ద ఎత్తున ఇల్లు కట్టి ఇస్తున్నామని… ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి ఆవినీతికి తావులేకుండా అర్హులకు డబుల్ బెడ్ రూంలు ఇస్తున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పేద వాళ్ళ ప్రభుత్వమని..ఎవరికి భయపడొద్దు అందరికి ఇల్లు వస్తుందని స్పష్టం చేశారు. 500 స్కెర్ ఫీట్లలలో అద్భుతమైన ఇల్లు నిర్మాణం జరుగుతుందని..ఆ ఘనత కెసిఆర్ సర్కార్ దేనని పేర్కొన్నారు. అలాగే ఇంటి.. ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నామని.. కేసీఆర్ చెప్పినట్లు మన పిల్లల భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరు చెట్లు పెంచి పచ్చదనం ఉండేలా కాలనీ చూసుకోవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంలో చరిత్రలో ఊహించని కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. బీడీలు చుట్టే.. ఆడబిడ్డలకు పింఛన్ ఇచ్చే సంస్కృతి మన దగ్గరే ఉందని గుర్తు చేశారు. త్వరలోనే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటన చేశారు.

Related posts