telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

పంచాయతీ రాజ్ అధికారుల బదిలీలో కొత్త ట్విస్ట్…

Nimmagadda ramesh

ఏపీలో పంచాయితీ రాజకీయాలు నడుస్తునా విషయం తెలిసిందే. అయితే అక్కడ పంచాయతీ ఎన్నికల ఎపిసోడ్‌లో ఎన్నో ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి… తాజాగా.. పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ బదిలీ ఎపిసోడులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది… పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ బదిలీ అయ్యారని మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఎస్‌ఈసీ ఏం బదిలీలు చేసుకున్నా.. ఏం చేసుకున్నా తాము పట్టించుకోమని పేర్కొన్నారు. అయితే, ఇటీవల తాము నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు హాజరుకాని గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌లపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ బదిలీ చేయాలని ఆదేశించారని.. దీంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆదేశాలను  పాటిస్తూ వారిని బదిలీ చేసిందనే వార్తలు వచ్చాయి.. కానీ, ద్వివేది, గిరిజా శంకర్ లను బదిలీ చేయాలని తాము కోరలేదంటున్నాయి ఎస్ఈసీ వర్గాలు. ఎన్నికలు కీలక దశలో ఉండగా పంచాయతీరాజ్ శాఖ అధికారుల బదిలీలు కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డ ఎస్ఈసీ… పీఆర్ అధికారుల బదిలీల విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ఎస్ఈసీ తిరస్కరించింది. ద్వివేది, గిరిజా శంకర్ బదిలీలు చేయదలిస్తే కమిషన్ నిబంధనలు పాటించాలని అంటోంది ఎస్‌ఈసీ. చూడాలి మరి ఈ విషయం పై ఇంకా ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు అనేది.

Related posts