telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఎన్డీఏకే పట్టం కట్టిన బీహార్ ప్రజలు…

ఎన్డీఏకే పట్టం కట్టారు బీహార్ ప్రజలు. మరోసారి సుశాసన్ బాబు నితీష్‌.. సీఎంగా ఎన్నిక కానున్నారు. అయితే ఈ సారి ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌.. తన సత్తా చాటారు. చివరివరకూ ఎన్డీఏకు గట్టిపోటీ ఇచ్చారు. ఎల్జేపీ పెద్దగా సీట్లు సాధించకున్నా.. గణనీయంగా ఓట్లు చీల్చింది. మొత్తం 243 స్థానాలకుజరిగిన ఎన్నికల్లో మేజిక్ ఫిగర్ సాధించింది. 125 స్థానాలు గెల్చి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇక ఆర్జేడీ ఆధ్వర్యంలోని మహాఘట్‌ బంధన్‌ 110 స్థానాలు సాధించింది. తొలిసారిగా ఎంఐఎం పార్టీ ఐదు స్థానాల్లో గెలవగా సీపీఐ ఎంఎల్‌ 12, సీపీఎం,సీపీఐ చెరో రెండుస్థానాలు, ఎల్జేజీ ఒక్కస్థానంలో నిలిచింది. మరోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండడంతో కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలారు. బిహార్ సుశాసన్ బాబు నితీష్‌ సమర్థపాలనకు జనం పట్టం కట్టారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే చాలా వరకూ సీట్లు తగ్గాయి. జేడీయూ 43 స్థానాలకు పరిమితమైంది. ఈ సారి ఎన్నికల్లో ప్రధాని మోడీ హవా స్పష్టంగా కనిపించింది. గతంలో 53 స్థానాలు సాధించిన బీజేపీ.. ఈసారి 74 స్థానాల్లో పాగా వేసింది. ఇక ఎన్డీఏకు చెమటలు పట్టించిన ఆర్జేడీ 75 స్థానాలు సాదించింది. గతంతో పోలిస్తే సీట్లు తగ్గినా… తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు తేజస్వి. కాంగ్రెస్ 19 స్థానాలను సాధించింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఎంఐఎం గురించి. ఈసారి ఏకంగా ఐదుస్థానాల్లో గెలిచింది. ముస్లిం ఓట్లను గణనీయంగా కొల్లగొట్టి, మహాఘట్ బంధన్ ఓట్లను చీల్చిందని చెప్పవచ్చు. ఇక ఎల్జేపీ గెల్చింది ఒక్క సీటైనా.. అధికార, విపక్ష కూటముల ఓట్లను చీల్చేసింది.

Related posts