telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీకి చేరుకున్న ద్రౌపది ముర్ము.. ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం..

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. ఏపీ పర్యటనలో భాగంగా మంగళవారం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ద్రౌపది ముర్మకు విమానాశ్రయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, మార్గాని భరత్‌, గోరంట్ల మాధవ్‌ స్వాగతం పలికారు. ఆమెకు గిరిజన సంప్రదాయంలో ఎంపీలు ఘన స్వాగతం అందించారు.

అక్కడ నుంచి ద్రౌపది ముర్ము, కిషన్ రెడ్డిలు రోడ్డు మార్గంలో విజయవాడుకు బ‌య‌లుదేరారు.ఆమె వెంట కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కూడా ఉన్నారు. అక్కడ సీఎం జగన్ తో ముర్ము భేటి కానున్నారు.

అనంతరం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ వెళ్లనున్నారు. ఆమెతో పాటు సీఎం జగన్ కూడా సీకే కన్వెన్షన్‌కు చేరుకోనున్నారు. అక్కడ వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ కానున్న ద్రౌపది ముర్ము.. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోరనున్నారు.

ఈ రోజు సాయంత్రం ద్రౌపది ముర్ముతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో సాయంత్రం సమావేశం అవుతారు. ఈ సమావేశంలో తెదేపా ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొననున్నారు. ఇక, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్దతు ఇస్తున్నట్టుగా చంద్రబాబు  నాయుడు సోమవారం వెల్లడించారు. టీడీపీ మొదటి నుంచి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. 

Related posts