telugu navyamedia
రాజకీయ వార్తలు

లక్నోలో ముస్లిం పర్సనల్ లా బోర్డు భేటీ.. హాజరైన అసదుద్దీన్ ఒవైసీ

asaduddin owisi

అయోధ్య తీర్పు నేపథ్యంలో అఖిల భారత ముస్లిం పర్సనల్ లా కీలక భేటీ ఈ రోజు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సమావేశమైంది.అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చి, ముస్లింలకు అయోధ్యలో 5 ఎకరాల స్థలం ఇవ్వాలని కూడా పేర్కొంది. ఈ తీర్పుపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవడానికి సమావేశంలో చర్చించనున్నారు.

ఈ సమావేశానికి ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు. కాగా, ఈ తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు అసంతృప్తిగా ఉందని ఇటీవల ఒవైసీ తెలిపిన విషయం తెలిసిందే. తాము పోరాడింది 5 ఎకరాల భూమి కోసం కాదని, న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. 

Related posts