ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలంగా మారిన లోన్ యాప్ ల కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. లోన్ యాప్ ల కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న నాగరాజును ఇటీవలే హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నాగరాజును ఢిల్లీ నుంచి సొంతప్రాంతమైన కర్నూలుకు రప్పించేందుకు ఆయన తండ్రి కీలక పాత్ర పోషించాడు. నాగరాజు లోన్ యాప్ కేసులో ఉన్నాడని ముందుగానే తెలుసుకున్న తండ్రి ఢిల్లీ నుంచి కర్నూలుకు రప్పించాడు. అదే సమయంలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నాగరాజు తండ్రి ఓ పోలీస్ అధికారి కావడం విశేషం. నాగరాజును ఇంటికి రప్పించి, పోలీసులు వచ్చే వరకు నాగరాజును ఇంట్లోనే ఉంచాడు. తన కొడుకు కంటే విధి నిర్వహణే ముఖ్యమని ఆ పోలీస్ అధికారి భావించాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. కర్నూల్ జిల్లాలో నాగరాజు తండ్రి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ అధికారి పేరు నీలకంఠం.. యాప్ ఫ్రాడ్ లో అతని ఇద్దరి కుమారులు ఉన్నారు. అతని మరో కుమారుడు శ్రవణ్ కుమార్… నాగరాజు తో శ్రవణ్ లను ఇద్దరిని పట్టించాడు అధికారి.
previous post
next post
పట్టు పెంచుకోవాలేతప్ప.. శత్రుత్వం పెంచుకోకూడదు: ఉండవల్లి