telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

కొడుకు దురుసుగా ప్రవర్తిస్తున్నాడని… ఆ తల్లి స్కూలుకెళ్లి ఏం చేసిందంటే ?

Mum

అమెరికాలోని కెంట్‌కు చెందిన బెక్కీకి 5గురు పిల్లలు. వారిలో పెద్ద కొడుకు స్థానికంగా ఉండే ఓ స్కూల్లో చదువుకుంటున్నాడు. అతను దురుసుగా ప్రవర్తిస్తున్నాడని ఆమెకు చాలామంది ఫిర్యాదులు చేశారు. అవి విన్నప్పుడల్లా.. ‘నువ్వు సరిగా ప్రవర్తించకపోతే స్కూలుకు వచ్చి నేను కూడా నీతోపాటు కూర్చుంటా’ అని బెక్కీ అతన్ని బెదిరించింది. ఈ బెదిరింపులను అతను పెడచెవిన పెట్టాడు. స్కూల్లోని ఓ మహిళా టీచర్‌తో దురుసుగా మాట్లాడాడు. ఈ విషయం తెలుసుకున్న బెక్కీ మారుమాట్లాడకుండా ఉన్నపళాన స్కూలుకు వెళ్లి అతని పక్కనే కూర్చుంది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. పిల్లలను సరిగా పెంచకపోతే వారు పూర్తిగా చెడిపోతారని, అందుకే తాను ఈ పని చేశానని ఆ పోస్టులో పేర్కొంది. ఈ పోస్టు క్షణాల్లోనే వైరలయింది.

Related posts