telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

సాక్షాత్తుగా దేశప్రధానే .. ఈసీ నిబంధనలకు .. వ్యతిరేకంగా, ..మోడీ ఉంగరాలు.. !

modi campaign with modi rings

ఈసీ నిబంధలనలను సాక్షాతుగా దేశప్రధానే పాటించకపోతే, ఇక మిగిలిన వారి గురించి చెప్పాల్సిన పనేలేదు. సాధారణంగా ఎన్నికల సమయంలో రాజకీయ నేతల ఫొటోలతో కూడిన హోర్డింగులు, పోస్టర్లు, దుస్తులతో పాటు నిత్యావసర వస్తువులు మార్కెట్‌లో కనిపిస్తుంటాయి. అయితే గుజరాత్‌లో ఇప్పుడు ఈ స్థాయి దాటిపోయింది. రాజ్‌కోట్‌లో ప్రధాని మోదీ ఫొటో కలిగిన బంగారు ఆభరణాలు విక్రయిస్తున్నారు. రాజ్‌కోట్‌లోని సోనీబజార్ దేశవ్యాప్తంగా ఎంతో పేరొందింది. ఇక్కడే ప్రధాని మోదీ ముఖచిత్రం కలిగిన రింగులను డిజైన్ చేశారు. దీనిలో బీజేపీ చిహ్నమైన కమలం గుర్తుతో పాటు మోదీ ముఖచిత్రం కూడా ఉంది. ఈ ఉంగరాలు ఎంతో ఆదరణ పొందుతున్నాయి.

ఈ ఉంగరాలు గుజరాత్‌లోనే కాకుండా రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌తో పాటు 12 రాష్ట్రాల్లో లభ్యమవుతున్నాయి. ఈ ఉంగరాలను బంగారంతోనే కాకుండా వెండితోనూ రూపొందిస్తున్నారు. వీటి ధర వెయ్యి రూపాయలు మొదలుకొని రూ. 30 వేల వరకూ ఉంటోంది. ప్రస్తుతం ఈ రింగులకు ఎంత డిమాండ్ పెరిగిందంటే..24 గంటల పాటూ స్వర్ణకారులు వీటిని తయారు చేయడంలో మునిగిపోయారు. అయినప్పటికీ డిమాండ్‌కు తగిన విధంగా మోదీ ఉంగరాలను రూపొందించలేకపోతున్నామని చెబుతున్నారు. ఇదిలావుండగా కొన్ని నెలల క్రితం సూరత్‌లో ప్రధాని మోదీ చిత్రంతో కూడిన చీరలను రూపొందించారు. ఇక రైల్వే స్టేషన్ లో టీ కప్ లపై ప్రధాని ఫోటోలు .. ఇలా చెప్పుకుంటూ పోతే.. మోడీ ప్రచారానికి కాదేది అనర్హం అన్నట్టుగా .. అన్ని విధాలుగా ప్రచారం చేసుకుంటున్నాడు. మరి ఇవన్నీ గమనిస్తున్న ఈసీ ఎప్పటికప్పుడు మోడీ ఈ ప్రచారాల గురించి చురకలు వేస్తూనే ఉంది. అయినా కొత్త ఆయన ప్రచారం కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది.

మరి సాక్షాత్తు దేశప్రధాని రాజ్యాంగవిరుద్దంగా నడుచుకుంటూ.. సభ్యసమాజానికి ఏ మెసెజ్ ఇద్దామనుకుంటున్నాడో ఏమిటో..!!

Related posts