telugu navyamedia
news political Telangana

పదవి కాలంలో చేసే మంచి పనులే శాశ్వతం: హరీష్ రావు

Ryathu bandhu amount Rs. 10000 in future

పదవి కాలంలో చేసే మంచి పనులే ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ గతనికి ఈ ఐదేళ్లకు జడ్పీలో చాలా తేడా ఉందన్నారు. గతంలో మధ్యాహ్నం వరకు కరెంట్ మీదే చర్చ జరిగేదన్నారు.తెలంగాణ ప్రభుత్వంలో కరెంట్ సమస్య లేకుండా పోయిందన్నారు.

సీఎం కేసీఆర్ అడిగినన్ని ట్రాన్స్ ఫార్మర్‌లు ఇచ్చారని ఈ సందర్భంగా హరీష్ చెప్పుకొచ్చారు. గతంలో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉండేదని గుర్తు చేశారు.ఈ రోజు మిషన్ భగీరథ వచ్చాక 90 శాతం తాగునీటి సమస్య తీరిందన్నారు. దశాబ్దాల కాలంలో జరగని పనులు మీ హయాంలో జరగడం ఎంతో సంతోషంగా ఉందని హరీష్ చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

తొలి విడత పోలింగ్‌ ప్రశాంతం..కౌంటింగ్ ప్రారంభం

ashok

సీఎం జగన్ కు దెయ్యం పట్టింది: పంచుమర్తి అనురాధ

vimala p

ప్రగతిభవన్‌లో ప్రారంభమైన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ సమావేశం

vimala p