telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ప్రైవేట్ స్కూల్స్ నిబంధనలను అమలు చేయాలి: మంత్రి సబిత

Sabitha indrareddy

ట్యూషన్ ఫీజు కాకుండా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఎలాంటి ఇతర ఫీజులు వసూలు చేయడానికి వీలు లేదని తెలంగాణ విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కరోనా వైరస్ వల్ల జనాలు ఇబ్బందులు పడుతున్నందున గతేడాది వసూలు చేసిన ఫీజునే ఈ ఏడాదీ తీసుకోవాలని మంత్రి విద్యాసంస్థలకు సూచించారు.ఇయర్లీ వసూలు చేసే ఫీజును నెలవారీగా ట్యూషన్ ఫీజుగా తీసుకోవాలని తెలిపారు.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రైవేట్ స్కూల్స్ అమలు చేయాలని కోరుతున్నానన్నారు.ఇప్పటికే ప్రైవేట్ విద్యాసంస్థలపై తిరుపతి రావు కమిషన్ అన్ని వివరాలు సేకరించిందన్నారు. హైకోర్టులో ప్రైవేట్ విద్యాసంస్థలు వేసిన కేసుపై ప్రభుత్వానికి అనుకూలంగా త్వరలోనే జడ్జిమెంట్ వస్తుందని ఆశిస్తున్నానని సబిత తెలిపారు. ట్యూషన్ ఫీజు కాకుండా స్కూల్ యాజమాన్యాలు ఎలాంటి ఇతర ఫీజులు వసూలు చేయడానికి వీలు లేదు. ప్రభుత్వ నిబంధనలను ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు విస్మరిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

Related posts