telugu navyamedia
తెలంగాణ వార్తలు

సినీ హీరో నితిన్ తో జేపీ నడ్డా భేటీ..సినీ, రాజకీయాల్లో హాట్ టాపిక్

తెలంగాణ రాజ‌కీయలు రోజురోజుకు వాడీవేడీగా మారుతున్నాయి. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా.. మరోసారి అధికార పగ్గాలు చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ జాతీయ నేతలు తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యనేతలు, ప్రముఖులు, సినీ హీరోలతో భేటీ అవుతున్నారు.

Image

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో బీజేపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది.

వరంగల్ బహిరంగ సభకు వచ్చిన జేపీ నడ్డా.. హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో బస చేశారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు.

Image

ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. అనంతరం సినీ హీరో నితిన్ తో భేటీ అయ్యారు. అయితే నితిన్ నడ్డాను కలవడం చిత్ర సీమలో, రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఎన్నికల్లో మోదీ కోసం ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా నితిన్ అన్నట్లు తెలుస్తోంది.

అంత‌కుముందు జేపీ నడ్డా పర్యటనలో భారత మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మిథాలీరాజ్‌తో శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేసిన జేపీ నడ్డా.. మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్‌తో సంభాషణ గొప్పగా సాగిందని చెప్పారు. ప్రధాని మోదీ అందించిన వ్యక్తిగత మద్దతు, మార్గదర్శకత్వాన్ని మిథాలీ రాజ్ ప్రశంసించినట్టుగా చెప్పారు.

Related posts