telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ప్రియురాలి ఇంట్లోకి చొరబడిన యువకుడు… దానికి ఒప్పుకోమంటూ బలవంతం

Crime

బలవంతంగా గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లోకి చోరబడిన యువకుడు ఆమె తనను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకునేంత వరకు ఇంటిని వదిలి బయటకు వచ్చేది లేదని భీష్మించుకుని కూర్చున్నాడు. దీంతో చేసేదేమిలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా వారిపై తిరగబడ్డాడు. యువతి తనను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంటేనే అక్కడి నుంచి వెళ్తానని వారితో చెప్పాడు. దీంతో అతడిపై పోలీసులు బలవంతంగా ఇంట్లో చోరబడడం, దాడి కేసు నమోదు చేశారు. ఈ మేరకు దుబాయి క్రిమినల్ కోర్టులో 24 ఏళ్ల సదరు యువకుడి తరుఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు.

Related posts