telugu navyamedia
సినిమా వార్తలు

“మజిలీ” ఫస్ట్ రివ్యూ వచ్చేసింది

Majili

నాగ‌చైత‌న్య‌, సమంత పెళ్లి త‌ర్వాత జంట‌గా తొలిసారి స్ర్కీన్ షేర్ చేసుకుంటున్న సినిమా “మజిలీ”. శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మాణంలో రూపొందిన “మ‌జిలీ” చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో స‌మంత‌తో పాటు దివ్యాన్ష కౌశిక్ మ‌రో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో జోరు పెంచారు చిత్రబృందం. ఇప్పటికే సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని “యూ/ఏ” సర్టిఫికేట్ పొందిన విషయం తెలిసిందే. 2 గంటల 34 నిమిషాల నిడివితో ఈ సినిమా ప్రదర్శితం కానుందని సమాచారం.

ఇక ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. విడుదలకు ముందే సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చి సినిమాపై అంచనాలు మరింతగా పెంచేశాడు హీరో సుశాంత్. సినిమా చూసిన సుశాంత్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ అందమైన కథను దర్శకుడు చాలా సున్నితంగా డీల్ చేశాడని, లవ్, పెయిన్ రెండిటినీ బాగా ఆస్వాదించానని, సినిమాలో సమంతా, చైతు జీవించేశారని, పాత్రలకు ప్రాణం పోశారని చెప్పుకొచ్చాడు. మొదటి సినిమా అయినా దివ్యాంక బాగా నటించిందని, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, గోపిసుందర్ మ్యూజిక్ హృదయాలను హత్తుకునేలా ఉందని అన్నారు. మజిలీ సినిమా అందమైన అనుభూతి అంటూ ట్వీట్ చేశారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా కోసం 200 థియేటర్లను కేటాయించినట్టుగా సమాచారం. పెళ్ళి తరువాత చైతూ, సమంత కలిసి చేస్తున్న మొదటి సినిమా కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలకు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనలభించింది. ఇక ప్రస్తుతం పెద్ద సినిమాలేవీ లేకపోవడం, “ఉగాది” పండుగ కావడం, ఈ శనివారం సెలవు రోజు కావడం ఈ సినిమాకి కలిసొచ్చే అంశాలని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక “మజిలీ” చిత్రాన్ని కేరళలో ఇండీవుడ్ డిస్ట్రిబ్యూషన్స్ నెట్వర్క్ ద్వారా ప్రత్యేకంగా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో విడుదల చేయనున్నారు.

Related posts