telugu navyamedia
సినిమా వార్తలు

ఝాన్సీతో విడిపోవడానికి కారణం ఇదేనంటున్న జోగినాయుడు

Jhansi-and-Joginaidu

ప్రముఖ యాంకర్ ఝాన్సీ పెళ్ళైన కొన్నాళ్లకే పేమించి పెళ్ళి చేసుకున్న తన భర్త జోగినాయుడుతో విడిపోయిన విషయం తెలిసిందే. అయితే వారెందుకు విడిపోయానే విషయంపై రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వీరి సన్నిహితులకు మాత్రమే వారెందుకు విడిపోయారన్న విషయం తెలుసు. కెరీర్ ఆరంభంలో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే అప్పట్లో ఝాన్సీ కెరీర్ విజయవంతంగా కొనసాగగా, జోగినాయుడు కెరీర్ మాత్రం డౌన్ అయ్యింది. అయితే ఝాన్సీని జోగినాయుడు వేధించాడని అప్పట్లో ప్రచారం జరిగింది. దీనిపై జోగినాయుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. తాను ఝాన్సీని వేధించానన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, ఝాన్సీతో ప్రేమ వివాహానంతరం 8 ఏళ్ల పాటు తమ జీవితం సాఫీగా సాగిపోయిందని, సరదాలు, విలాసాల విషయంలో ఇతరులతో పోల్చుకోవడం వల్లే జీవితాలు నాశమవుతాయని, అలాంటి అంశాల కారణంగానే తమ మధ్య కూడా గొడవలు మొదలయ్యాయని తెలిపాడు. ఝాన్సీ తన నుంచి విడిపోవడానికి ఆర్థిక పరమైన విషయాలే కారణమని జోగినాయుడు తెలిపాడు.

Related posts