telugu navyamedia
సినిమా వార్తలు

నరేష్ కే మెగా మద్దతు… మరికొన్ని గంటల్లో “మా” ఎన్నికలు…

Nagababu-with-Naresh

మా అసోసియేషన్ కి అధ్యక్షుడుగా ఉన్న శివాజీరాజా పదవీకాలం పూర్తి అయిపోయింది. దీంతో మళ్ళీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. శివాజీరాజా మళ్ళీ పోటీకి సిద్ధమయ్యారు. మరోవైపు సీనియర్ హీరో నరేష్ కూడా రంగంలోకి దిగారు. మరికొన్ని గంటల్లో “మా” మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ వాతావరణం పూర్తిగా మారిపోయింది. “మా” అధ్యక్షుడు పదవి కోసం పోటీ చేస్తున్న శివాజీరాజా, నరేష్ ఇద్దరూ తమకు మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఉన్నట్లుగా ప్రచారం చేసుకున్నారు. అయితే నిజానికి మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఎవరికుందనే విషయం ఇప్పుడు తెలిసిపోయింది.

తాజాగా మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ తాను నరేష్, జీవిత, రాజశేఖర్ ప్యానల్ కు మద్దతు ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అధ్యక్షుడుగా ఒక్కరే పలుమార్లు ఉండకూడదన్నది తన అభిప్రాయమని, తాను ప్రెసిడెంట్ గా చేసినప్పుడు రెండవసారి కూడా అదే పదవిలో కొనసాగాలని “మా” సభ్యులు కోరగా… తాను అందుకు అంగీకరించలేదని, అసలు ఏ అభ్యర్థికి కూడా రెండుమూడు సార్లు పదవిలో కొనసాగాలనే కోరిక ఉండొద్దని తెలిపారు. ఇక మహిళగా జీవిత పోటీలో నిలబడడం తనకు నచ్చిందని, అంతేకాకుండా నరేష్, జీవిత, రాజశేఖర్ లకు ఎంతో అనుభవం ఉందని అన్నారు. అంటే మెగా ఫ్యామిలీ పూర్తి మద్దతు నరేష్ కే అన్నమాట. దీంతో “మా” వార్ వన్ సైడ్ అయినట్టే…!

Related posts