telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

లైగర్ రిలీజ్ డేట్ వచ్చేసింది…

విజయ్ దేవరకొండ… పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్ తనదైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తరువాత అర్జున్ రెడ్డితో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమా తరువాత వెంటనే గీతా గోవిందం అంటూ అమాయకుడిగా కూడా అందరినీ మెప్పించారు. ప్రస్తుతం విజయ్ మాస్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు మొదట ఫైటర్ పేరు ప్రచారణలో ఉన్నా సినిమాకు మాత్రం లైగర్ అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమాలో విజయ్ బాక్సర్‌గా కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఇండస్ట్రీలో అనేక వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను జులైలో రిలీజ్ చేయనున్నారని కూడా టాక్ వచ్చింది. ఇప్పుడు  ఈసినిమాను సెప్టెంబర్9న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు సినిమా రిలీజ్ డేట్‌పై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ మేరకు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను రేపు అనౌన్స్ చేయనున్నారు. చూడాలి మరి ఈ సినిమా అభుమానుల అంచనాలను అందుకుంటుందా… లేదా అనేది.

Related posts