telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

లాడెన్ కుమారుడు హంజాబిన్ లాడెన్ మృతి .. : అమెరికా నిఘా వర్గాలు

laden son died declared by america intelligence

అమెరికా ఇంటలిజెన్స్ వర్గాలు ఒసామాబిన్ లాడెన్ కుమారుడు హంజాబిన్ లాడెన్ మరణించాడని వెల్లడించాయి. లాడెన్ హత్యానంతరం అల్ ఖైదా చీఫ్‌గా హంజాబిన్ లాడెన్ వ్యవహరించేవాడు. హంజాబిన్ అల్ ఖైదా కార్యకలాపాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో అతని ఆచూకీ చెప్పినా, అతన్ని పట్టించిన వారికి భారీ రివార్డు ఇస్తామని గతంలో అమెరికా ప్రకటించింది. హంజాబిన్ లాడెన్ తలపై అమెరికా మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. హంజా ఎక్కడ మరణించాడు? అనే విాషయం మాత్రం అమెరికా వెల్లడించకుండా రహస్యంగా ఉంచింది. హంజాబిన్ లాడెన్ చివరిసారిగా 2018లో మీడియాకు విడుదల చేసిన వీడియోలో సౌదీఅరేబియాను బెదిరించాడు.

ఒసామాబిన్ లాడెన్ కు ఉన్న ముగ్గురు భార్యలు పాక్ లోని అబోత్తాబాద్ ఇంట్లో నివాసమున్నారు. అబోత్తాబాద్ ఇంట్లో దాడి జరిపినపుడు హంజాబిన్ లాడెన్ (29) కనపించలేదు. లాడెన్ ను 2011లో అమెరికా నావికాదళం పాక్ దేశంలోని అబోత్తాబాద్ రహస్య స్థావరంలో ఉండగా పట్టుకొని హతమార్చింది. అప్పట్లో ఆ దాడి నుంచి హంజాబిన్ లాడెన్ తప్పించుకున్నాడని వార్తలు వెలువడ్డాయి. గతంలో అమెరికాకు హెచ్చరికలు జారీ చేసిన హంజాబిన్ లాడెన్ ను ఆ దేశం అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి, అతని ఆస్తులను బ్లాక్ లిస్టులో పెట్టింది.

Related posts