telugu navyamedia
news political Telangana

విమానాలను ఏర్పాటు చేయాలని .. కేంద్ర మంత్రిని కోరిన కేటీఆర్‌

KTR TRS Telangana

లాక్ డౌన్ నేపథ్యంలో గల్ఫ్ లో ఇబ్బందిపడుతున్న కార్మికుల కోసం మస్కట్‌ నుంచి హైదరాబాద్‌కు విమానాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌, కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకీ విజ్ఞప్తి చేశారు. నిత్యావసరాలు, జీతాలు లేక అక్కడ భారతీయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ట్విటర్‌లో పేర్కొన్నారు.

కరీంనగర్‌ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ అనే కార్మికుడు మస్కట్‌లో గత రెండు సంవత్సరాల నుంచి మస్కట్‌ లో ఉంటున్నాడు. అయితే మూడు నెలలుగా పని, ఆహారం, జీతాలు లేకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని వీడియో తీసి కేటీఆర్‌కు ట్యాగ్‌ చేశాడు. భారత్‌కు వద్దామనుకుంటే హైదరాబాద్‌కు విమానాలు లేక కార్మికులు అవస్థలుపడుతున్నారని పేర్కొన్నాడు.

Related posts

రాజ్యసభ స్థానాన్ని గెలిచే సంఖ్యాబలం టీడీపీకి లేదు: రోజా

vimala p

పింఛన్ల పంపిణీలో వైసీపీ నాయకులు రూ.50 లాక్కుంటున్నారు: నారా లోకేశ్

vimala p

మరికొన్ని రోజులు క్వారంటైన్ లోనే బ్రిటన్ ప్రధాని… ఇంకా తగ్గని కరోనా లక్షణాలు

vimala p