telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సౌత్ కొరియాలో మరో నటుడు మృతి… వరుసగా స్టార్ల ఆత్మహత్యలు

Ha

సౌత్ కొరియాలో కొంతకాలం క్రితం పలువురు ఆర్టిస్టులు ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు వినిపించాయి. గతంలో కొరియన్ పాప్ స్టార్ సులీ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే సోషల్ మీడియాలో తనపై వస్తున్న కామెంట్స్, ట్రోల్స్ తట్టుకోలేక సులి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నెల రోజుల వ్యవధిలోనే సౌత్ కొరియాకు చెందిన గూ హరా ఆత్మహత్య చేసుకున్నారు. సియోల్‌లోని తన నివాసంలో శవమై కనిపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘గుడ్ బై’ అని మెసేజ్ చేసి ఆ తర్వాత ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు. ఆ తర్వాత ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. తనకున్న స్టార్‌డం వల్ల సోషల్ మీడియాలో ట్రోలింగ్, కామెంట్స్ తట్టుకోలేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపారు. ఆ తర్వాత గూ హరాకు తన మాజీ ప్రియుడి నుంచి బెదదిరింపులు ఎదురయ్యాయి. సెక్స్ వీడియోను ఆన్‌లైన్‌లో పెడతానంటూ బెదిరించాడు. దాంతో గూ హరా గత నెలలో మళ్లీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సౌత్ కొరియాకు చెందిన కొందరు ఆర్టిస్టులు తమ మానసిక స్థితి దిగజారిందని, నటన విషయంలో ఒత్తిడి ఎదురవుతున్నదని చెప్పుకొచ్చారు. ఇదే కోవలో ఇప్పుడు మరో వార్త మన ముందుకొచ్చింది. కొరియాలో పలు డ్రామా షోలలో కనిపించే ఛా ఇన్ హా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అతని అభిమానులకు తీవ్రంగా కలచివేస్తోంది. నటుడు ఛా ఇన్ హా మృతి చెందిన విషయాన్ని దక్షిణ కొరియా పోలీసు అధికారి మీడియాకు వెల్లడించారు. కాగా అతని మృతికి గల కారణాలు తెలియరాలేదు. పాప్‌ సింగర్స్ సులీ, గూ హరాల ఆత్మహత్యలు సౌత్ కొరియాలో కలకలం రేపాయి. వీరి ఆత్మహత్య కేసులపై విచారణ జరుగుతుండగానే చా ఇన్ హా అనే 27 ఏళ్ల సినీ నటుడు తన నివాసంలో శవమై కనిపించాడు. దాంతో కొరియన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతోంది ? అన్ ప్రశ్న నెటిజన్లలో ఆందోళన కలిగిస్తోంది.

Related posts