telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

తెలంగాణ ఖ్యాతిని పెంచేలా.. కైట్, స్వీట్ ఫెస్టివల్…

kite and sweet festival celebrations in hyd

సంక్రాంతికి పతంగులు ఎగురవేయడం పరిపాటే. అయితే అదికాస్తా కార్పొరేట్ అయిపోయిందేమో, కైట్ ఫెస్టివల్ అంటూ తెలుగింట జరుపుతున్నారు. దీనితోపాటుగా ఎక్కడెక్కడి సాంప్రదాయ స్వీట్ లను అందుబాటులోకి తెస్తూ.. స్వీట్ ఫెస్టివల్ అంటూ జరుపుతున్నారు. ఈ రెండిటిని సంక్రాంతి సందర్భంగా పండగ మూడురోజులు జరుపుతున్నారు. హైదరాబాద్ ఖ్యాతి ఇనుమడించేలా అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్ ని నిర్వహిస్తామని తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. కైట్, స్వీట్ ఫెస్టివల్ నిర్వహణపై సమీక్షించారు.

సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఈ ఫెస్టివల్ ఈ నెల 13 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్టు చెప్పారు. కైట్ ఫెస్టివల్ కు 20 దేశాల నుంచి నిపుణులు పాల్గొంటారని, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే మహిళలు వెయ్యి రకాల స్వీట్స్ ను ప్రదర్శిస్తారని చెప్పారు. ఈ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాలకు ప్రతీకగా నిలిచే మిఠాయిలు ఉంటాయని, ఈ ఫెస్టివల్ నిర్వహించినన్నీ రోజులూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కైట్, స్వీట్ ఫెస్టివల్ లలో ప్రతియేటా వేలమంది పాల్గొని ఆనందిస్తున్నారు. ఏదిఏమైనా కైట్, స్వీట్ ప్రియులకు ఇది మంచి అవకాశం. 

Related posts