ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హిందీ, తెలుగు, తమిళం… ఇలా భాషలతో సంబంధం లేకుండా బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకి సంబంధించి ఇప్పటికే పలు బయోపిక్ చిత్రాలు రూపొందాయి. ప్రస్తుతం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా, పీవీ సింధు, మహిళా క్రికెట్ క్రీడాకారిణి మిథాలీ రాజ్ వంటి క్రీడాకారిణుల బయోపిక్‌లు కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా జీవిత నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కనుందనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే తన జీవిత నేపథ్యంలో బయోపిక్ తెరకెక్కనుందనే వార్తని ఓ భేటిలో సానియా కన్‌ఫాం చేసినప్పటికి, ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే సానియా పాత్రలో కరీనా కపూర్ నటించనున్నట్టు ఓ టాక్ నడుస్తుంది. “క్రీడాకారుల ప్రవర్తన, కఠోర శ్రమ, తల్లిదండ్రుల త్యాగం వంటివి చాలా మందికి తెలియడం లేదు. కేవలం గ్లామర్‌ని మాత్రమే చూస్తున్నారు. నా బయోగ్రఫీతో తెరకెక్కనున్న చిత్రంలో నేను భాగం కావాలని భావిస్తున్నాను” అని సానియా పేర్కొన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
previous post
next post