telugu navyamedia
సినిమా వార్తలు

తెలుగు సినిమాలకు ఊరట కలిగించిన అమెజాన్

Netflix

అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలు ఎంతగా పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటి ద్వారా తెలుగు సినిమాలకు భారీ సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. ఇంకా సినిమాలు థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతున్నప్పటికీ అమెజాన్ లాంటి సంస్థలు వాటిని డిజిటల్ స్ట్రీమింగ్ చేసేసేవి. దీంతో సినిమా వసూళ్లకు పెద్ద నష్టం వచ్చేది. ఇటీవల విడుదలైన “ఎఫ్-2” సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. సినిమా హిట్ టాక్ తో విజయవంతంగా థియేటర్లలో ఆడుతుండగానే డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా టీవీల్లో ప్రత్యక్షమైంది. ఈ పరిస్థితి వల్ల నిర్మాతలు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఇకపై సినిమా విడుదలైన 8 వారల తరవాతే డిజిటల్ స్ట్రీమింగ్ చేయాలని నిబంధన విధించారు. ఈ నిబంధన ఏప్రిల్ 1 నుండి అమలులోకి రానుంది. దీని మూలంగా తెలుగు సినిమాలకు డిజిటల్ స్ట్రీమింగ్ నుండి పెద్ద ముప్పు తప్పింది. దీంతో అమెజాన్ నుండి తెలుగు సినిమాలకు ఊరట లభించినట్టయ్యింది.

Related posts