telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

ప్రభాస్ ను .. పొగడ్తలతో ముంచేస్తున్న .. కాజల్ ..

kajal praising prabhas

ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా దేశవ్యాప్తంగా కనివిని ఎరుగని విధంగా భారీ అంచనాల మధ్య విడుదలైంది. తెలుగు తమిళం మలయాళం హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా సౌత్ లో తప్ప నార్త్ లో అద్భుతమైన టాక్ సొంతం చేసుకుంది. సౌత్ ఇండస్ట్రీ లో చాలా వరకు సినిమా కొన్న బయ్యర్లు ప్రస్తుతం నష్టాల బాటలో ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ విషయంలో కాజల్ అగర్వాల్ ని సినిమా నిర్మాతలు యు.వి.క్రియేషన్స్ సంస్థకి చెందిన వాళ్లు మొదట కలిసినట్లు అప్పట్లో సినిమా రిలీజ్ సమయంలో అనేక వార్తలు వచ్చిన సంగతి మనకందరికీ తెలిసినదే. బ్యాడ్ బాయ్ అనే స్పెషల్ సాంగ్ లో మొదట కాజల్ అగర్వాల్ ని తీసుకోవాలని భావించిన తర్వాత బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ జాక్వలిన్ నీ తీసుకోవడం జరిగింది. ఈ సాంగులో జాక్వలిన్ అదిరిపోయే రీతిలో అందాలు ఆరబోసింది.

ఇండస్ట్రీలో ఈ సాంగ్ కోసం కాజల్ ని అనుకున్నారని.. ఆ తర్వాత జాక్వెలిన్ కి ఫిక్స్ అయ్యారని వార్తలు వచ్చాయి. దీనితో కాజల్ ప్రభాస్ పై అలిగినట్లు కూడా ఊహాగానాలు వినిపించాయి. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల సందర్భంలో సినిమా యూనిట్ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. కాజల్ అగర్వాల్ ని సంప్రదించినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని పేర్కొంది. ఇటువంటి క్రమంలో తాజాగా కాజల్ అగర్వాల్ ప్రభాస్ పై ఆసక్తికరమైన కామెంట్లు ఇంటర్వ్యూలో చేసింది. ప్రభాస్ ని హాలీవుడ్ సూపర్ హీరోలతో పోలుస్తూ ప్రశంసల వర్షం కురిపించింది. ఐరన్ మ్యాన్, హల్క్ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుందో ప్రభాస్ అలా ఉంటాడు అని కాజల్ తెలిపింది. దీంతో ఈ కామెంట్ లో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.

Related posts