telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా.. జస్టిస్‌ జెకె మహేశ్వరిని సిఫార్సు చేసిన కొలీజియం ..

justice maheswari as ap high court Chief Justice

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తులతో కూడిన కొలీజియం జస్టిస్‌ జెకె మహేశ్వరిని నియమించేందుకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు న్యాయ వర్గాల సమాచారం. కొలీజియం సిఫార్సులను కేంద్రప్రభుత్వం ఆమోదిస్తే ఆమె ఎపి హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడతారు.

ఇప్పటి వరకూ ఎపి హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్‌ ఉన్నారు. హైకోర్టు విభజన తర్వాత పూర్తిస్థాయిలో సీజే లేరు. జస్టిస్‌ మహేశ్వరి ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్‌ విక్రంనాథ్‌ పేరును సిఫార్సు చేస్తే కేంద్రప్రభుత్వం ఆమోదించలేదు. ఇప్పుడు తాజాగా మహేశ్వరి పేరు కొలీజియం సిఫార్సు చేసింది. కేంద్రం ఆమోదిస్తే రాష్ట్రపతి ఆమోదముద్ర వేశాక, కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్‌ వెలువడ్డాక నియామక ప్రక్రియ పూర్తి అవుతుంది.

Related posts