telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బీజేపీ పై మహారాష్ట్ర సీఎం ఫైర్…

uddhav-thackeray-shivasena

‘భారత్ మాతా కీ జై’ అని నినాదాలు ఇచ్చే బీజేపీ నేతలే దేశభక్తులు కాదంటూ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే వ్యాఖ్యానించారు.. హిందుత్వం, రైతుల ఆందోళన, మొతెరా స్టేడియం తదితర అంశాలపై మాట్లాడిన ఆయన.. బీజేపీ నుంచి హిందుత్వాన్ని నేర్చుకోవలసిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.. స్వాతంత్ర్య పోరాటంలో శివసేన పాల్గొన్నలేదు.. అదే సమయంలో బీజేపీ మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా పాల్గొనలేదనే విషయాన్ని గుర్తుకు చేశారు.. ఇక, ‘భారత్ మాతా కీ జై’ అని నినాదాలు చేసినంత మాత్రానా.. బీజేపీ నేతలు నిజమైన దేశభక్తులు కారని వ్యాఖ్యానించిన ఆయన.. అసలు భారత్ మాతా కి జై అని నినదించే హక్కు బీజేపీకి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు మేం చత్రపతి శివాజీ మహారాజ్‌ పేరు పెట్టామని గుర్తు చేసిన మహారాష్ట్ర సీఎం.. కానీ, బీజేపీ మాత్రం గుజరాత్‌లోని మోతెరాలో సర్దార్‌ పటేల్‌ స్టేడియం పేరును నరేంద్ర మోడీ స్టేడియంగా మార్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై స్పందించిన ఆయన.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న పంజాబ్‌ రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts