telugu navyamedia
రాజకీయ వార్తలు

జూలై నెలలో పూర్తి స్థాయి కేంద్ర బ‌డ్జెట్‌ !

నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తి స్థాయి కేంద్ర బ‌డ్జెట్‌ను పార్లమెంట్ లో జూలై మొద‌టి వారంలో ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశాలు ఉన్నాయి. రైతుల స‌మ‌స్య‌లు, వ్య‌వ‌సాయం, ఉద్యోగం లాంటి అంశాల‌ను బ‌డ్జెట్‌లో చేర్చనున్నారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి ఒక‌ట‌వ తేదీన మోదీ ప్ర‌భుత్వం తాత్కాలిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. ఆ బ‌డ్జెట్‌లో రైతుల‌కు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి కొన్ని రాయితీలు ప్ర‌క‌టించారు.

మాజీ ఆర్థిక మంత్రి పీయూష్ గోయ‌ల్‌.. తాత్కాలిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. రియ‌ల్ ఎస్టేట్‌, ఇన్ ఫ్రా, నిర్మాణ రంగాల‌పైన కూడా కేంద్ర బ‌డ్జెట్‌లో పెద్ద పీట వేయ‌నున్నారు. చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు, మేక్ ఇన్ ఇండియాకు కూడా కేటాయింపులు పెంచ‌నున్నారు. ఎఫ్‌డీఐ రంగంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్నారు.

Related posts