telugu navyamedia
andhra political

చంద్రబాబు అడ్డదారులు మొదలు పెట్టారు: జగన్‌

YS Jagan Files Nomination Pulivendul
వచ్చే ఎన్నికల కోసం చంద్రబాబు ఇప్పటికే అడ్డదారులు మొదలు పెట్టారని వైసీపీ అధినేత జగన్‌ ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన సమరశంఖారావం సభలో జగన్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనపై విమర్శల వర్షం కురిపించారు. సర్వేల పేరిట వ్యతిరేక ఓట్లు తొలగిస్తున్న చంద్రబాబు.. అనుకూలంగా దొంగ ఓట్లు నమోదు చేయించుకుంటున్నారు. 
మాజీ ఎంపీ లగడపాటితో దొంగ సర్వేలు చెప్పించి గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు.  ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ బదులు పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టి  ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి విస్మరించారన్నారు. .మూడేళ్లలో పోలవరం పూర్తి చేస్తానని చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు.  ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేరిందా అని చంద్రబాబును నిలదీయండన్నారు. రాష్ట్రంలో పాలన లేదు, ప్రజాసంక్షేమం లేదని పాదయాత్రలో గ్రహించానని జగన్ తెలిపారు.

Related posts

ఏపీ-తెలంగాణ మధ్య పోరు : ఏపీ డీజీపీ ఠాకూర్ ఇంటి అక్రమ నిర్మాణాన్ని కూల్చేసిన జీహెచ్ఎంసీ ..!

vimala p

ఈసారి కశ్మీర్ ని వదిలేదిలేదు.. యుద్ధం చేసైనా సాధిస్తాం.. : పాక్ ఆర్మీ చీఫ్

vimala p

నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ పై జగన్ స్పందించాలి: యనమల డిమాండ్

vimala p