telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

శ్రీహరికోట : … సి48 ప్రయోగం .. నేడే..

isro will launch c48 today

ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌సెంటర్‌ షార్‌ నుంచి పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి48 ద్వారా రాడార్‌ ఇమేజింగ్‌ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ (రీశాట్‌-2బీఆర్‌1) ఉపగ్రహాన్ని బుధవారం నిర్ణీతకక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. దీనికి సోమవారం నిర్వహించిన రిహార్సల్‌ విజయవంతంగా ముగిసింది. మంగళవారం సాయంత్రం 4.25కు 23 గంటల కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానుంది. మొదటి ప్రయోగవేదిక నుంచి బుధవారం సాయంత్రం 3.25 గంటలకు పీఎస్‌ఎల్‌వీ నింగిలోకి దూసుకెళ్లనుంది. పీఎస్‌ఎల్‌వీ రీశాట్‌-2బీఆర్‌1తో పాటు, వాణిజ్య ఒప్పందంలో భాగంగా విదేశాలకు చెందిన తొమ్మిది ఉపగ్రహాలను వాటి కక్ష్యల్లో ప్రవేశపెడుతుంది.

Related posts