telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ప్రపంచ కప్ వివాదం.. ఐసీసీ స్పందన.. ఎవరిపని వారిదే..

icc on wrong throw in world cup

ఐసీసీ ఫైనల్‌లో వివాదాస్పద ఓవర్ త్రోపై స్పందించింది. అంపైర్ల నిర్ణయంపై వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొంది. నిబంధనలపై తమకున్న అవగాహన మేరకే మైదానంలో అంపైర్లు నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. విధానపరమైన ఇటువంటి నిర్ణయాలపై వ్యాఖ్యలు చేయడం సబబు కాదని పేర్కొంది. న్యూజిలాండ్ ఫీల్డర్ విసిరిన బంతి బెన్‌స్టోక్స్ బంతిని తాకి బౌండరీకి చేరుకుంది. దీంతో ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు లభించాయి.

నిబంధనల ప్రకారం ఓవర్ త్రోకు ఐదు పరుగులే ఇవ్వాల్సి ఉంటుందన్న కొత్త వాదన తెరపైకి వచ్చింది. అదే జరిగి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఇక సూపర్ ఓవర్ కూడా టై కావడంతో బౌండరీ సంఖ్య ఆధారంగా ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో ఐసీసీ స్పందించింది. విధాన పరమైన ఇటువంటి నిర్ణయాలపై వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికింది.

Related posts