telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నేను యాంగ్జైటీతో బాధపడుతున్నాను… శృతి హాసన్

Shruthi-Haasan

కమల్ హాసన్ కూతురిగా శృతి హాసన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదట్లో టెక్నికల్ యూనిట్ తో కలిసి పని చేసిన శృతి ఆ తరువాత హీరోయిన్ గా ప్రమోట్ అయ్యింది. టెక్నిషియన్ గా రాణిస్తూనే హీరోయిన్ గా మెప్పించింది. తమిళంతో పాటుగా తెలుగులో అనేక సినిమాలు చేసింది శృతి హాసన్. అయితే, వరసగా సినిమాలు చేస్తున్న సమయంలో సడెన్ గా బ్రేక్ ఇచ్చి ఇండస్ట్రీకి దూరమైనా శృతి హాసన్ తిరిగి మాస్ మహారాజా రవితేజ సినిమా క్రాక్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. అయితే లాక్ డౌన్ అమ‌లైనంత కాలం ముంబైలో గ‌డిపిన న‌టి శ్రుతి హాస‌న్..అన్ లాక్ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వ్వ‌గానే హైదారాబాద్ వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం బంజారాహిల్స్ లోని త‌న నివాసంలో ఉంటోన్న శ్రుతి త‌నకు అల‌వాటైన ఈవెనింగ్ రన్నింగ్ గురించి మాట్లాడుతూ “నేను లండ‌న్ నుంచి ముంబై వ‌చ్చాక సిటీ అంతా జ‌నాలు లేకుండా ప్ర‌శాంతంగా అనిపించింది. నేను ఉంటోన్న అపార్ట్మెంట్ ఎంతో అంద‌మైన‌ది. కానీ అక్క‌డ ర‌న్నింగ్ చేయ‌డానికి బాల్క‌నీ కానీ, గార్డెన్ కానీ లేదు. దీంతో బ‌య‌ట‌కు వెళ్ల‌డం ప్రారంభించాను. తాజాగా వ‌ర్క్ ఉన్న నేప‌థ్యంలో హైద‌రాబాద్ వ‌చ్చాను. ఇక్క‌డ గార్డెన్ ఉంది. అక్క‌డ చాలా క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తాను. ఇక కావాల‌నుకున్న‌ప్పుడల్లా రన్నింగ్ కు వెళ్తాను. నేను ఫిట్‌గా ఉండటానికి పరిగెత్తుతున్నాను. కానీ ఇది నా మానసిక ఆరోగ్య వ్యాయామంలో కూడా ఒక భాగం. నేను యాంగ్జైటీతో బాధపడుతున్నాను. రెగ్యులర్ వ్యాయామం అనేది దానిని అదుపులో ఉంచుతుంది. గ‌తంలో నేను మెంట‌ల్ హెల్త్ గురించి మాట్లాడాలంటే చాలా ఇబ్బంది ప‌డ్డా. మ‌న వీక్ నెస్ బ‌య‌టకు తెలిస్తే..ఈ ప్ర‌పంచం చుల‌క‌న‌గా చూస్తుంద‌ని భావించా. కానీ దాని గురించి ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న నింపాల‌ని నిర్ణ‌యంచుకున్నా. అంద‌రం క‌లిసి క‌ట్టుగా ఈ స‌మ‌స్య‌పై పోరాడాలి” అని శ్రుతి హాస‌న్ పేర్కొంది. ఇక శ్ర‌తి హాస‌న్..మార్షల్ ఆర్ట్స్‌లో కూడా శిక్షణ పొందుతోంది.

Related posts