telugu navyamedia
సినిమా వార్తలు

ఆసక్తి రేపుతోన్న “యశోద” టీజర్..

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘యశోద’. హరి-హరీశ్‌ సంయుక్తంగా దీన్ని రూపొందిస్తున్నారు.

లేడీ ఓరియెంటెడ్ కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై ఆసక్తిని పెంచేశాయి.

తాజాగా ఈ సినిమా టీజర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో సమంత గర్భిణిగా కనిపించనున్నారు. “కంగ్రాట్స్‌ నువ్వు ప్రెగ్నెంట్‌. మొదటి మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. టైమ్‌కి తినాలి. ఎక్కువసేపు నిద్రపోవాలి. జాగ్రత్తగా నడవాలి. ఇంట్లో పనులు చేయొచ్చు.. కానీ, బరువులెత్తకూడదు. ఏ పని చేసినా దెబ్బతగలకుండా చూసుకోవాలి” అంటూ వైద్యురాలు చెప్పే సూచనలతో ఈ టీజర్‌ సాగింది.

Samantha's Yashoda Movie Is Being Made Basing A True Incident

అయితే.. వైద్యురాలు చెప్పిన దానికి పూర్తి భిన్నంగా ‘యశోద’ జీవితం సాగినట్లు.. తిండి, నిద్ర, ప్రశాంతత లేకుండా ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొంటున్నట్లు ఈ టీజర్‌లో చూపించారు. తనకు ఎదురైన ప్రతి ప్రమాదాన్ని ఆమె మరింత ధైర్యంగా ఎదుర్కొన్నట్లు ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. అసలు యశోదకు ఎదురైన ప్రమాదం ఏంటి? ఆమెని ఇబ్బందిపెడుతోన్న వ్యక్తులు ఎవరు? ఆమె భర్త, కుటుంబ సభ్యులు ఎవరు? ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలతో సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఈసినిమా సిద్ధమవుతోంది.

Watch: First glimpse of Samantha's Yashoda hints at riveting sci-fi thriller | The News Minute

ఇక, యశోదగా సామ్ నటన మెప్పించేలా ఉంది. పోరాట సన్నివేశాల్లో ‘వావ్‌’ అనిపించింది. ఈ సినిమా టీజర్‌ని షేర్‌ చేసిన సామ్‌.. “ధైర్యం, సంకల్పం” అని పేర్కొన్నారు.

ఇందులో వరలక్ష్మి శరత్‌కుమార్‌, ఉన్ని ముకుందన్‌, రావు రమేశ్‌, మురళీ శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు. ఈచిత్రాన్ని శ్రీదేవీ మూవీస్ బ్యానర్ మీద శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోండగా.. హరి–హరీష్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Related posts