telugu navyamedia
సినిమా వార్తలు

ఆసుపత్రి బిల్లు కట్టలేని స్థితిలో టాలీవుడ్ హీరోయిన్… సాయం కోసం అర్థింపు 

Heroine Vijayalakshmi admitted to hospital
సెలెబ్రిటీల జీవితాలు చూసేందుకు తళుకులీనుతున్నా… పూల పాన్పులా కన్పిస్తున్నాయి వారి నిజ జీవితాల్లో మాత్రం ఎన్నో చీకటి కోణాలు ఉంటాయి. స్టార్లుగా హోదాను అనుభవించిన ఎంతోమంది జీవితాలు చివరకు ఎలాంటి దుర్భర జీవితాలను అనుభవించారో మనకు తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్ కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. హీరోయిన్ విజయలక్ష్మి… గతంలో హనుమాన్ జంక్షన్‌లో హీరోలు అర్జున్, జగబతిబాబులకు చెల్లెలుగా, హీరో వేణు సరసన ఒక సినిమాలో హీరోయిన్ గా నటించించింది. ఆ తరువాత అవకాశాలు లేక క్యారెక్టర్ ఆర్టిస్టుగా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఈ హీరోయిన్ ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. 
ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన విజయలక్ష్మీ తన దగ్గరున్న డబ్బును ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఖర్చు చేసేసింది. తాజాగా బీపీ లెవెల్స్ మరింతగా పెరిగిపోవడంతో బెంగుళూరులోని మల్లయ్య ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స అందుకుంటోంది. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం కుదుటపడినా మరికొన్నాళ్లు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారట. అయితే ప్రస్తుతం విజయలక్ష్మీ ఆసుపత్రి బిల్లు సైతం కట్టలేని పరిస్థితిలో ఉంది. దీంతో  విజ‌య‌ల‌క్ష్మీ చెల్లెలు ఉషాదేవి సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులు తన అక్క‌ని ఆదుకోవాల‌ని కోర‌గా పలువురు సినీ పెద్దలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేస్తున్నారని తెలుస్తోంది.

Related posts