telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

ఏపీ విద్యార్థులకు శుభవార్త… ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు

ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 8.93 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 368 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,93,734 కు చేరింది. ఇందులో 8,84,347 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,188 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు అమలుపై అధికారులకు మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహణ, మాస్కులు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి ఆదిమూలపు సురేష్‌. ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని… ఎండలు, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పాఠశాల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలని ఆదేశించారు మంత్రి ఆదిమూలపు సురేష్. 1 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు నిర్వహించాలని.. ఉదయం 7.45 నుంచి 11.30 వరకు తరగతులు చేపట్టాలన్నారు. తరువాత మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 

Related posts