telugu navyamedia
రాజకీయ

జ్ఞానవాపి వివాదంపై వార‌ణాసి కోర్టు సంచ‌ల‌న తీర్పు

*జ్ఞానవాపి వివాదంపై వార‌ణాసి కోర్టు సంచ‌ల‌న తీర్పు
*అంజుమన్ ఇంత‌జామీయా క‌మిటీ పిటిష‌న్ కొట్టివేత‌..

ఉత్తర్‌ప్రదేశ్‌ జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.అంజుమన్‌ ఇంతజామియా కమిటీ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.

మసీదు ప్రాంగణంలో శృంగార గౌరి ప్ర‌తిమ‌కు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలన్నహిందూ సంఘాలు వేసిన‌ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈనెల 22న విచారణ ప్రారంభమవుతుంది.

జ్ఞాన్​వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదుగురు మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన వారణాసి సివిల్‌ జడ్జి కోర్టు అక్కడ వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశాలిచ్చారు. 

దీంతో జ్ఞాన్​వాపి మసీదు- శృంగార్‌ గౌరీ ప్రాంగణంలో వీడియోగ్రఫీ సర్వే చేశారు. ప్రార్థన స్థలంలోని భూగర్భ నేలమాళిగలు, చెరువు, మూడు గోపురాలను సర్వే బృందం వీడియో తీసింది.

అయితే మసీదులోని కొలనులో శివలింగం కనిపించినట్లు పిటిషనర్ల తరపు న్యాయవాది తెలిపారు. ఈ సర్వే నివేదికను అడ్వకేట్‌ కమిషనర్ కోర్టులో సమర్పించారు. అయితే అది శివలింగం కాదంటూ మసీద్‌ కమిటీ వాదిస్తోంది.

ఆపై సుప్రీం కోర్టుకు చేరిన ఈ వ్యవహారం తిరిగి వార‌ణాసి కోర్టుకే చేరింది. ఆ త‌రువాత ముస్లిం సంస్థల పిటిషన్‌ను వారణాసి కోర్టు కొట్టేసింది. తీర్పు సందర్భంగా కోర్టు హాల్‌లో 64 మందికి మాత్రమే అనుమతిచ్చారు.

కోర్టు తీర్పు రావడంతో ఉత్తరప్రదేశ్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. వారణాసితో పాటు లక్నో , అయోధ్యతో పోలీసులు ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు

 

Related posts