telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్-3లో “గే” సెలబ్రిటీ

Bigg-Boss-3

ఇటీవలే తమిళ బిగ్‌బాస్-3 సీజన్ తొలి ప్రోమో విడుదలైంది. ఈ షోకు కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 2017లో ప్రారంభమైన బిగ్‌బాస్ షో.. ఇప్పటికే రెండు పార్టులు పూర్తి చేసుకుంది. జూన్‌లో మూడో సీజన్‌‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్వాహకులు ఇప్పటికే కంటెస్టెంట్లను కూడా ఎంపిక చేశారు. సినీనటులు ప్రసన్న, పవర్ స్టార్ శ్రీనివాసన్, సంజన సింగ్, ఆల్యా మానస, రచితామహాలక్షి, హరి హర భాస్కర్ ఈ షోలో పాల్గొననున్నారు. తాజాగా విడుదలైన ప్రోమో షోపై ఆసక్తిరేపుతోంది. ఇక తాజాగా ఈ షోకు సంబంధించిన ఓ వార్త హల్చల్ చేస్తోంది. 

ఈ షోలో ఓ స్వలింగ సంపర్కుడు పాల్గొనబోతున్నాడని సమాచారం. కమల్ హాసన్ తో చర్చించిన తరువాతే షో నిర్వాహకులు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరెవరైనా హోస్ట్ అయితే ఈ నిర్ణయానికి ఒప్పుకునేవారు కాదేమో కానీ కమల్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం చెప్పలేదట. అయితే ఆ స్వలింగ సంపర్కుడు ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదు. షోలో ఓ గే సెలబ్రిటీ ఉంటే ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతారో తెలుసుకోవడానికే ఈ విషయాన్ని లీక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తమతో పాటు ఓ గే హౌస్ లో ఉంటాడంటే మిగిలిన పోటీదారులు ఎలా ఫీల్ అవుతారో చూడాలి.

Related posts