telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సామాజిక

గణేష్ ఉత్సవాలు : .. దక్షిణాఫ్రికాలో .. ఘనంగా వేడుకలు..

ganesh utsav in southafrica

భారతీయులు యావత్ ప్రప్రపంచంలో ఉద్యోగ, వ్యాపారరీత్యా జీవిస్తున్నారు. దీనితో హైందవ సంస్కృతి కేవలం భారత్‌లో మాత్రమే కాక పలు దేశాల్లోకూడా విస్తరించింది. మలేషియా, ఇండోనేషియా, మయన్మార్, ఇంకా పలు దేశాల్లో హైందవ పండుగలు సైతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికాలో కూడా గణేశ్ నవరాత్రులు నిర్వహించడం వార్తలకెక్కింది.

దక్షిణాఫ్రికాలోని ఘనా దేశంలో కూడా దాదాపు 12 వేలమంది భారతీయులు నివసిస్తున్నారు. వీరు ఏటా భారతీయ సంప్రదాయం ప్రకారం పండుగలు ఆచరిస్తూనే ఉన్నారు. భారతీయులతో పాటు అక్కడనున్న దక్షిణాఫ్రికా వాసులు సైతం ఈ పండుగలకు హాజరవుతారు. ప్రస్తుతం అక్కడ వినాయక చవితి పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చవితి రోజున గణేశ్‌ను పూజించి మూడు రోజుల తర్వాత అక్కడికి దగ్గర్లో ఉన్న సముద్రంలో నిమజ్జనం చేయడం వీరికి అలవాటు. ఈ విధంగా పండుగలు జరుపుకోవడం అనేది 1970లోనే ప్రారంభమైందనట్టుగా తెలుస్తోంది.

Related posts