telugu navyamedia
సామాజిక

కైట్‌ ఫెస్టివల్ చేసుకున్న వానరుడు… వీడియో వైరల్

monkey

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలంతా ఇంట్లోనే ఉంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి వస్తున్నారు. అయితే ఈ క్రమంలో పలు జంతువులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా ఓ కోతి గాలిపటం ఎగరవేస్తూ దర్శనమిచ్చింది. ఓ బిల్డింగ్‌పైన ఉండి అచ్చం మనుషులు ఎగరేసినట్లుగానే ఆ కోతి పతంగిని ఎగరేస్తూ లాక్‌డౌన్‌లో ఎంజాయి చేస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. అటవీ అధికారిణి సుసాంతా నందా తన ట్విటర్‌లో ఈ గాలిపటం ఎగరేస్తున్న కోతి వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోకు.. కొతి గాలిపటాన్ని ఎగరేస్తోంది.. అవును ఇది ఖచ్చితంగా కోతే అంటూ క్యాప్షన్ పెట్టారు.

Related posts