నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన “118” సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే రాబట్టుకుంది. ఆ తరువాత కళ్యాణ్ రామ్ గ్యాప్ లేకుండా కొత్త సినిమాలకు వరుసగా ఒప్పుకుంటున్నాడు. నేడు కళ్యాణ్ రామ్ 41వ పుట్టినరోజును జరుపుకోబోతున్నాడు. ఈ స్పెషల్ డే రోజున అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ తన కొత్త సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో చేస్తోన్న సినిమాకు “ఎంత మంచివాడవురా” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కళ్యాణ్ రామ్ ఒక సరికొత్త ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది. “శతమానం భవతి” సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేసిన సతీష్ ఆ తరువాత “శ్రీనివాస కళ్యాణం”తో కాస్త తడబడ్డాడు. ఈ సినిమా ద్వారా ప్రముఖ మ్యూజిక్ సంస్థ ఆదిత్య మ్యూజిక్ వారు ప్రొడక్షన్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు. ఉమేష్ గుప్తా నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్ ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. వర్షంలో తడుస్తున్న ఇద్దరు చిన్నారులకు మొక్కజొన్న కండి కొనిచ్చి సైకిల్‌పై వెళ్తున్న సమయంలో `ఎంత మంచివాడవురా` అంటూ బ్యాగ్రౌండ్లో పాటతో విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది.
next post
కరోనా, ఎయిడ్స్ కంటే శ్రీరెడ్డే ఎక్కువ ప్రమాదం : రాకేష్ మాస్టర్