telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లక్ష్మీస్ ఎన్టీఆర్ : “ఎందుకు…” సాంగ్

Lakshmi's-NTR

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు తాను తెరకెక్కిస్తున్న “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా నుండి “ఎందుకు..?” అనే రెండో పాటను విడుదల చేశారు. ”జయసుధ, జయప్రద, శ్రీదేవీ.. వీళ్లందరినీ వదిలి ఆ లక్ష్మీపార్వతినే ఎందుకు..? ఎందుకు..?” అంటూ సాగే పాటను ట్విట్టర్ ద్వారా విడుదల చేశాడు. ఇంతకుముందే ”ఈ పాటలోని ప్రశ్నల వెనుక.. అబద్దాలుగా చెలామణి అవుతోన్న నిజాలను, నిజాలుగా మసిపూసుకున్న అబద్ధాలను బండకేసి కొట్టి ఉతికి ఆరేయటమే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ధ్యేయం” అంటూ వర్మ వెల్లడించారు.

ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్… మరోవైపు రామ్ గోపాల్ వర్మ కూడా ఎన్టీఆర్ బయోపిక్ ను “లక్ష్మీస్ ఎన్టీఆర్”గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తరువాత జరిగిన సంఘటనలతో “లక్ష్మీస్ ఎన్టీఆర్”ను తెరకెక్కిస్తున్నాడు వర్మ. కళ్యాణ్ మాలిక్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Related posts