telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

విదేశాలనుంచి వచ్చిన వారిని జాగ్రత్తగా గమనించాలి: మంత్రి ఈటల

Etala Rajender

విదేశాలనుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా గమనించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.కరోనా పై ఈ రోజు మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ సర్వేలెన్స్ పెంచడం ద్వారానే కరోనాను అరికట్టగలమని ఆ టీమ్స్ ను పెంచాలని ఆదేశించారు.

ఇప్పటికే మన దగ్గర వైరస్ వ్యాప్తి రెండవ దశలోకి చేరుకుంది. 26 వ తేదీ మధ్యాహ్నం వరకు 44 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా ఒక్కరికి పూర్తిగా నయం అయ్యింది. మిగిలిన వారందరూ కోలుకుంటున్నారు ఎవరికీ ప్రాణాపాయ స్థితి లేదని మంత్రి తెలిపారు. గాంధీ ఆసుపత్రిని పూర్తిగా కరోనా చికిత్సకే వినియోగించేలా తయారు చేయాలని చెప్పారు. ఇప్పటికే గాంధీలో చేయాల్సిన ఆపరేషన్లను ఉస్మానియా ఆసుపత్రిలో చేస్తున్నారు.

ఈ నెలాఖరు వరకు మిగతా అన్నీ విభాగలను కూడా తరలించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డిని ఆదేశించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలో పనిచేసేవారు..  అక్కడే ఉండేలా చూడాలని, సెలవులు పూర్తిగా రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరం ఉన్న చోట్ల సిబ్బందికి భోజన, రవాణా సదుపాయం ఏర్పాటు చేయాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావును ఆదేశించారు. విదేశాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరి డేటా ఉండాలని సూచించారు.

Related posts