చైనాలో పుట్టిన కరోనా ప్రపంచం మొత్తాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే 21వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది యుద్ధం చేస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రమాదకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని మోదీ భారతదేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిపై పోరాటానికి తమ వంతు సాయం అందించేందుకు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు సైతం ముందుకొస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి చెందిన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ రెండు తెలుగు రాష్ట్రాలకూ విరాళం ప్రకటించింది. ఒక్కో రాష్ట్రానికి రూ.10 లక్షలు చొప్పున దిల్ రాజు విరాళం ప్రకటించారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దేశానికి రూ.కోటితో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకూ రూ.50 లక్షల చొప్పున విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే త్రివిక్రమ్ రూ.20 లక్షలను విరాళంగా ప్రకటించారు.
previous post