telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హృతిక్ ఇంటికి చేరిన మాజీ భార్య.. కరోనా ఎఫెక్ట్

RRR

‘ఆర్ఆర్ఆర్’ టైటిల్‌ ఫుల్‌ఫామ్‌తో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు దర్శకధీరుడు రాజమౌళి. పోస్ట‌ర్ ఉగాది సంద‌ర్భంగా బుధ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు దీన్ని విడుదల చేశారు రాజమౌళి. మోష‌న్ పోస్ట‌ర్‌లో ఆర్ అంటే రౌద్రం, ఆర్ అంటే రుధిరం, మ‌రో ఆర్ అంటే ర‌ణం అని చూపించారు. ఇందులో రామ్‌చ‌ర‌ణ్ అగ్ని క‌ణాల మ‌ధ్య‌, ఎన్టీఆర్‌ని స్వ‌చ్ఛ‌మైన జ‌లాల మ‌ధ్య‌ చూపించారు. రౌద్రానికి రుధిరానికి మ‌ధ్య జ‌రిగే ర‌ణంగా ఈ చిత్రం ఉండ‌బోతోంద‌ని మోష‌న్ పోస్ట‌ర్ చెప్ప‌క‌నే చెబుతోంది. ఇప్పటికే ఈ మోషన్ పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తాజాగా దీనిపై డైరెక్టర్ వివి వినాయక్ స్పందించారు. మరోసారి టైటిల్‌లో ఉన్న రౌధ్రం, రణం, రుధిరం అర్థం ఏమిటో వివరించారు.  బ్రిటీష్ ప్రభుత్వ పాలనపై కట్టలు తెంచుకున్నదే ‘రౌద్రం’. ఈ ఇద్దరూ కలిసి చేయాలనుకున్నది ‘రణం’ అని, ఆ యుద్ధంలో వాళ్లు అర్పించినది ‘రుధిరం’ అని ఆయన కామెంట్ చేశారు. వినాయక్ కామెంట్ వైరల్ అవుతోంది. ఇక వినాయక్ ట్వీట్‌పై ఆర్జీవీ స్పందించారు. ఒత్తిడిని పెంచే వార్తలు విరామం లేకుండా ఒకదాని తరువాత ఒకటి వినాల్సి వస్తోన్న సమయంలో.. రాబోయే మంచి విషయాల కోసం ఎదురుచూడాలని గుర్తు చేసిన రాజమౌళికి ధన్యవాదాలు తెలిపారు.

Related posts