telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తప్పు నాది కూడా… సాయితేజ్ ను దోషిని చేయకండి… చిరుకు హరీష్ శంకర్ ట్వీట్

chiranjeevi

కరోనా పుణ్యమా అని ఇప్పుడు అందరూ ఇంటి దగ్గరే ఉంటూ జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఉగాది పర్వదినాన సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్విట్టర్‌లో మెగాస్టార్‌కు శుభాకాంక్షలు హోరెత్తుతున్నాయి. తనకి స్వాగతం పలికిన సెలబ్రిటీలందరికీ చిరంజీవి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కరోనా వైరస్ కారణంగా ఇంటికే పరిమితం అయిన వారందరికీ చిరంజీవి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వినోదం పంచుతున్నారు. కాగా తన మేనల్లుడు సాయిధరమ్ స్వాగతానికి కౌంటర్ వేశారు. ముందుగా సాయిధరమ్ తేజ్ చిరు ఎంట్రీని పురస్కరించుకుని ‘వెల్‌కమ్ బాస్’ అంటూ స్వాగతం పలికారు. దీనికి ధన్యవాదాలు తెలిపిన చిరు.. ‘ఇకపై నా సినిమాలలోని సాంగ్స్‌ని రీమిక్స్ చేసేముందు ఈ వేదిక (ట్విట్టర్) ద్వారా నన్ను అడుగు..’’ అని రిప్లయ్ ఇచ్చారు. దీనికి సాయిధరమ్‌తో చిరు సాంగ్‌ని రీమిక్స్ చేయించిన హరీష్ శంకర్ రిప్లయ్ ఇస్తూ.. ‘‘తప్పు నాది కూడా లేకపోలేదు.. పాపం మా సాయితేజ్ తమ్ముడిని ఒక్కడినే దోషిని చేయకండి..’’ అంటూ ట్వీట్ చేశారు.

Related posts