telugu navyamedia
సినిమా వార్తలు

“ఆర్ఆర్ఆర్”లో అనుష్క ?

Anushka

మెగాప‌వ‌ర్‌స్టార్‌ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీయార్ క‌థానాయ‌కులుగా ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి “ఆర్ఆర్ఆర్” పేరుతో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 300 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను డీవీవీ దాన‌య్య నిర్మిస్తుండగా… అలియా భ‌ట్ ఒక హీరోయిన్ గా న‌టిస్తోంది. మ‌రో హీరోయిన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్ అనుష్క ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ పాత్ర కేవ‌లం ఐదు నిమిషాలు మాత్ర‌మే ఉంటుంద‌ని, రాజ‌మౌళి అడిగిన వెంట‌నే ఈ పాత్ర‌లో న‌టించేందుకు అనుష్క ఓకే చెప్పిన‌ట్టు సమాచారం. “భాగ‌మ‌తి” త‌ర్వాత సినిమాలకు కొంత కలం బ్రేక్ ఇచ్చిన అనుష్క ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలతో బిజీగా ఉంది.

Related posts