telugu navyamedia
సినిమా వార్తలు

ప్రభాస్ కు జోడీగా సమంత ?

Samantha-and-PRabhas

తెలుగు, తమిళ భాషల్లో వరుస విజయాలను అందుకుంటోంది సమంత. గత కొంతకాలంగా నటనకు ప్రాధాన్యత కలిగిన విభిన్నమైన పాత్రలను చేస్తూ భారీ ఫాలోయింగ్ ను దక్కించుకుంటోంది. ప్రస్తుతం సమంత, నాగ చైతన్య జంటగా “మజిలీ” చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తరువాత సమంత ప్రధాన పాత్రలో నటించిన “ఓ బేబీ” చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలా ఉండగా… ఇప్పుడు సమంతకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. త్వరలోనే ప్రభాస్ తో సమంత జోడి కట్టనుందనే వార్త ఫిల్మ్ నగర్లో విన్పిస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ “సాహో” షూటింగులోను, మరోవైపు రాధాకృష్ణ దర్శకత్వంలోను ఓ చిత్రం చేస్తున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోయే రొమాంటిక్ ఎంటర్టైనర్ కు “జాన్” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు అనంతరం ప్రభాస్, దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా చేయనున్నాడని సమాచారం. ఒక క్రేజీ డైరెక్టర్ తో కథను సిద్ధం చేయిస్తోన్న దిల్ రాజు, ఈ సినిమాలో కథానాయికగా సమంతను ఎంపిక చేసుకున్నారని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తోన్న సినిమాలు పూర్తయిపోగానే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.

Related posts