‘ఇస్మార్ట్ శంకర్’ ఈ సినిమా థియేటర్స్‌లో ఎన్ని కలెక్షన్లు రాబట్టిందో యూట్యూబ్‌లోనూ అంతే సెన్సేషన్ క్రియేట్ చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన దిమాక్ ఖరాబ్ వీడియో సాంగ్ విడుదలైన నాటి నుంచే యూట్యూబ్‌ని షేక్ చేసింది.పూరీ జగన్నాథ్, రామ్ కలయికలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. మాస్ ఆడియన్స్‌ని ఈ చిత్రం డాన్సులు చేయించింది. రామ్ కెరీర్‌లో కూడా తొలిసారి 40 కోట్ల షేర్‌కు చేరువగా వచ్చిన సినిమా ఇది. 11 ఏళ్లుగా సరైన బ్లాక్ బస్టర్ లేని పూరీకి ఈ చిత్రం నిర్మాతగా, దర్శకుడిగా మంచి లాభాలని తీసుకొచ్చింది. ఇక రామ్ కూడా అంతే. చాలా ఏళ్ళ తర్వాత అసలైన బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. సినిమా మాదిరే వీడియో సాంగ్స్ కూడా రచ్చ చేస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో యూ ట్యూబ్‌లో విడుదలైన దిమాక్ ఖరాబ్ వీడియో సాంగ్ అప్పుడే 100 మిలియన్ వ్యూస్ అందుకుంది. నిధి అగర్వాల్, నభా నటాషా అందాల ఆరబోతతో ఈ పాట మాస్‌కు పిచ్చెక్కించింది. శేఖర్ మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ చేశాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పూరీ తన తర్వాతి సినిమా చేస్తున్నాడు.